అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. చికాగోలోని మిడ్వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సౌత్ వెస్ట్‌కు చెందిన విమానం ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అనుమతి మంజూరు చేశారు. అదే సమయంలో రన్ వేకు అడ్డంగా మరో ప్రైవేట్ జెట్ వచ్చింది.
దాని రాకను గమనించిన పైలెట్ వెంటనే అప్రమత్తమై సౌత్ వెస్ట్ విమానాన్ని మళ్లీ గాల్లోకి ఎగిరించాడు. లేనియెడల ఘోర ప్రమాదం సంభవించేది.అంతేకాకుండా పెద్ద మొత్తంలో ప్రాణనష్టం సంభవించేంది. కాగా, ఇటీవల అమెరికాలో జరిగిన రెండు విమాన ప్రమాద ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.