ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై స్పందించిన ఎన్నికల సంఘం…!

-

ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై స్పందించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్‌ నంబర్‌ 202తో పాటు 7 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది. పీఎస్‌ నంబర్‌ 202 లో జరిగిన ఘటనలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పీ రామకృష్ణారెడ్డి వెబ్‌ కెమెరాలో రికార్డ అయ్యారు.

Pinnelli Ramakrishna Reddy who destroyed the EVM should be punished

ఈవీయంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ను ఆదేశించింది. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఈసీ భావిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news