విద్యార్థులకు రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు పాఠశాల విద్యార్థులకు 20 వేల ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నోకియా ప్రతినిధులతో సీఎం చర్చించారు.
ఏ తరగతి చదివే విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌లు అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని TGPSC తెలిపింది. 1:100 నిష్పత్తి సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థుల వినతులను తిరస్కరిస్తున్నట్లు మెమో జారీ చేసింది. కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనలను పరిశీలించాలని TGPSCకి కోర్టు సూచించగా.. ఆ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.