బోరుగడ్డ అనిల్ కు బిగ్‌ షాకిచ్చిన హై కోర్టు !

-

వైసీపీ కి చెందిన బోరుగడ్డ అనిల్ కు షాక్‌ తగిలింది. బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో అనంతపురం నాలుగవ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బొరుగడ్డ అనిల్ హైకోర్టు లో పిటిషన్ వేశారు. అయితే.. ఆ పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు. పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని వ్యాఖ్యానించింది కోర్టు.

Borugadda Anil Arrested

పిటిషనర్ కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసులలో ఇప్పటికే రెండు కేసులలో ఛార్జ్ షీట్ దాఖలు అయ్యిందని బిఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందని వివరించారు ప్రాసిక్యూషన్. అయితే… ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి…. ఇలాంటి కేసులలో నిందితులను క్షమించడానికి వీలు లేదని… బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ కొట్టేశారు. దీంతో వైసీపీ కి చెందిన బోరుగడ్డ అనిల్ కు షాక్‌ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news