జమ్ముకాశ్మీర్ సరిహద్దుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ యుద్దంలో పోరాడుతూ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.అయితే, మురళినాయక్ కుటుంబ సభ్యులు తన కొడుకు మరణవార్త తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఇవాళ ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఈ తరుణంలోనే పాక్ దాడుల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళి నాయక్ పార్థివదేహానికి జన నివాళి అందింది. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండకు వీర జవాన్ మురళి నాయక్ పార్థివదేహం చేరుకుంది. గుమ్మయ్య గారిపల్లి నుంచి కల్లితాండ వరకు దాదాపు 300 వాహనాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేల మంది ప్రజలతో ఘన నివాళి ఇచ్చారు. మురళి అమర్ రహే అని నినాదాలు చేస్తూ జవాన్‌కు నివాళి అర్పించారు ప్రజలు. ఇక ఇవాళ జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు జరుగనున్నాయి.