అమృతసర్‌లో హై టెన్షన్..ఉదయం కూడా మోగుతున్న సైరన్లు..!

-

అమృతసర్‌లో హై టెన్షన్ నెలకొంది. అమృతసర్‌లో ఉదయం కూడా సైరన్లు మోగుతున్నాయి. బ్లాక్ అవుట్ ఎత్తివేసినా.. అలర్ట్‌ కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Amritsar
High tension in Amritsar Sirens are sounding even in the morning

కాగా పాకిస్థాన్ దొంగ దెబ్బ. మళ్లీ కాల్పులు ప్రారంభించింది పాకిస్థాన్. ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాక్. శ్రీ నగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అక్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్‌తో దాడులు చేస్తోంది పాకిస్థాన్. మరోవైపు, శ్రీనగర్‌లో బ్లాక్ ఔట్ కొనసాగుతోంది. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటు ట్వీట్ చేశారు. దింతో బార్డర్ లో ఉన్న నగరాల్లో బ్లాక్ అవుట్ అమలు చేసారు ఇండియన్ అధికారులు. ఇందులో భాగం గానే  అమృతసర్‌లో ఉదయం కూడా సైరన్లు మోగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news