తిరుమలలో మిస్సైన ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ఆచూకీ లభ్యం అయింది. ఇవాళ తిరుమలలో ఉన్న టిటిడి ఉచిత బస్సు మిస్ అయింది. ఇవాళ ఉదయం 3 గంటలకు ఎలక్ట్రిక్ బస్సు జియన్ సి టోల్ గేట్ దాటినట్లు గుర్తించారు విజిలేన్స్ అధికారులు. అనంతరం నాయుడుపేట మండలం బిరదవాడలో గుర్తించిన పోలీసులు..బస్సును స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలలో మిస్సైన ఉచిత ఎలక్ట్రిక్ బస్సును చెన్నై వైపు తీసుకెళుతుండగా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందట. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడంతో బస్సును వదిలి పరారయ్యాడు నిందుతుడు. దీంతో బస్సును స్వాధీనం చేసుకున్న నాయుడుపేట పోలీసులు.. తిరుమలకు తరలిస్తున్నారు. ఇక అటు తిరుమల ట్రాన్స్ ఫోర్ట్ జీఎం పై పోలీసులు సీరియస్ అయ్యారు. బస్సు మిస్ మీడియాలో వచ్చేంత వరకు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో.. ఎఫ్ఆర్ లో నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ట్రాన్స్ ఫోర్ట్ జీఎం పేరు ఎఫ్ఐఆర్ లో నమోదైతే.. జీఎం ను సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారు టీటీడీ అధికారులు.