క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారత్-ఆస్ట్రేలియాకి జరిగే మ్యాచ్ అనుమానమే..!

-

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా ఇవాళ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ వన్డే సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇండోర్ లోనే సిరీస్ ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. భారత్ జోరుకు వరుణుడు అడ్డుకట్టవేసేవిధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇండోర్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ వర్షం పడే అవకాశమున్నట్టు పేర్కొంది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని తెలిపింది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తొలి వన్డే మొహలిలో ఆటకు వర్షం అంతరాయం కలిగించిన విషయం విధితమే. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జరుగుతుండగా కొద్ది సేపు వర్షం కురవడంతో ఆంఫైర్లు మ్యాచ్ ను కొంత సమయం నిలిపివేశారు. రెండో వన్డేలో భారత్ కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news