చిత్తూరు జిల్లా కుప్పంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాబును దెబ్బకొట్టేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారట. కుప్పం వై ఇన్చార్జిగా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. ఎమ్మెల్సీ భరత్ ను ఇంచార్జ్ పదవి నుండి తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ ఓటమి నేపథ్యంలో కుప్పం వైసిపి ఇన్చార్జ్ పదవి నుండి భరత్ ను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎన్నికలు ముగిసిన తర్వాత నుండి కుప్పం నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్ కు ఎమ్మెల్సీ భరత్ అందుబాటులో లేకపోవడంతో వైసిపి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం కుప్పం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే కుప్పం ఇంచార్జ్ గా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి భాధ్యతలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు వైసిపి నేతలే చర్చించుకుంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.