చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని విచారించారు సిట్ అధికారులు. ఎస్వీ యూనివర్సిటీ పీఎస్ లో 2గంటలకు పైగా కొనసాగింది విచారణ.ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన అంశాలను సిట్ అధికారులకు క్షుణ్ణంగా వివరించాను అని తెలియజేసిన నాని.. వారు సిట్ అధికారులకు అవాస్తవాలు చెబుతున్నారని వెల్లడించారు. కేసుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా వివరించాను…ఘటనకు ముందు తర్వాత జరిగిన ఘటనల గురించి అడిగారని వెల్లడించారు.
వీడియో, ఫోటో ఆధారాలను అందజేశారు…సమ్మెటతో దాడి చేయలేదని ఆరోపించడం అవాస్తవం అన్నారు. సాక్ష్యాలు ఉన్నాయి, సిట్ అధికారులు అందజేశాను…దాడికి వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులను శిక్షించాలని కోరానని చెప్పారు. దాడికి సంబంధం లేని, తిరుమలకు చెందిన ముగ్గురుని అరెస్ట్ చేశారని తెలిసిందని.. సిట్ అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు.