తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి టెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 20 వరకు టెట్‌కు దరఖాస్తులు స్వీకరించగా, పేపర్ 1కి 99,958 మంది, పేపర్ 2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లు కలిపి టెట్ పరీక్షకు 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నట్టు టెట్ కన్వీనర్ ప్రకటించారు.
రేపటి నుంచి జూన్ 6వ తేదీ వరకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్షలు కొనసాగనున్నట్లు టెట్ కన్వీనర్ తెలిపారు. రోజు 2 సెషన్ల చొప్పున ఉదయం 9 నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 నిమిషాల వరకు టెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80 కేంద్రాల్లో పరీక్ష జరగనుందని.. ఇందులో అత్యధికంగా మేడ్చల్ 25, రంగారెడ్డిలో 17 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు టీఎస్ టెట్ కన్వీనర్ ప్రకటించారు. టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయని టెట్ కన్వీనర్ చెప్పారు.