ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ చేతిపై బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీల్ చైర్ లో కదలేని స్థితిలో ఉన్న కుమార్తెను తీసుకొని వచ్చిన తల్లి ఆరుద్ర సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చింది.
అక్కడ నిర్వహించే స్పందనలో సీఎంఓ అధికారులను కలిసిి వచ్చాక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆ మహిళను గమనించిన సీఎంవో పోలీసులు హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. తన కూతురు దివ్యాంగురాలి చికిత్స కోసం తమ భూమిని అమ్ముకోనీయకుండా ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. అయితే తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై సుమోటో విచారణకు మహిళా కమిషన్ ఆదేశించింది. వివరణ నివేదిక ఇవ్వాలని కాకినాడ ఎస్పీకి లేఖ రాసింది రాష్ట్ర మహిళా కమిషన్.