కరాచీ బేకరి… పాకిస్థాన్ పేరు అంటూ విశాఖలో రచ్చ !

-

విశాఖపట్నంలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న పంచాయతీ ఎఫెక్ట్ పడింది. విశాఖలో ఉన్న కరాచీ బేకరీ పైన… స్థానిక జన జాగృతి సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఉన్న కరాచీ బేకరీ పేరు… పాకిస్తాన్ వాళ్లదని…. ఆ పేరు వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు జన జాగృతి సమితి సభ్యులు. ఈ మేరకు ధర్నా కూడా చేశారు.

There is anger over the name of Pakistan in Visakhapatnam
KARACHI

విశాఖలోని డైమండ్ పార్క్ రోడ్డులో అలాగే వెంకోజీ పాలెం లో ఉన్న కరాచీ బేకరీ పేరును మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. విశాఖలో పాకిస్తాన్ పేరు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ ఉగ్రవాదులు గత 15 రోజులకు ఉందట జమ్మూ కాశ్మీర్ లో మారణకాండకు తెరలేపిన సంగతి తెలిసిందే. పహల్గాం అనే ప్రాంతంలో… ఏకంగా 28 మందిని కాల్చి చంపారు పాకిస్తాన్ ఉగ్రవాదులు.

Read more RELATED
Recommended to you

Latest news