వైసీపీ నేత ఇంటికి వెళ్లి దాడి చేసిన కొలికపూడి శ్రీనివాస్ !

-

టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. వైసీపీ నేత ఇంటికి వెళ్లి దాడి చేశాడట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. గోపాలపురం గ్రామంలోని వైసీపీ వార్డు సభ్యుడు భూక్య కృష్ణపై దాడి చేసినట్లు చెబుతున్నారు. వీడియో తీస్తుండగా భుక్య కృష్ణ కుమారుడిపై దాడి చేసి.. ఫోన్ ధ్వంసం చేశాడు టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.

Thiruvuru MLA Kolikapudi Srinivas went to YCP leader’s house and attacked him

అడ్డువచ్చిన కృష్ణ భార్యను దుర్భాషలాడాట కొలికపూడి. దీంతో మనస్తాపంతో మహిళ ఆత్మహత్యయత్నం కూడా చేసుకుందని సమాచారం. ఇక టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరును నిరసిస్తూ గోపాలపురం గ్రామస్థుల ధర్నా చేశారట. తన స్థల వివాదాన్ని పరుష్కరిస్తామని పెద్ద మనుషుల ఒప్పందంతో… గతంలో తన స్థలం గుండా రోడ్డు నిర్మాణానికి అంగీకరించాడు భూక్య కృష్ణ. అయినా, సమస్య పరిష్కారం కాకపోవడంతో రోడ్డుకు అడ్డంగా తీగ కట్టాడట బాధితుడు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలుసుకోకుండా భూక్య కృష్ణ ఇంటికి వెళ్లి దాడి చేశాడట. బూట్లతో ఎమ్మెల్యే తన్నుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version