ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేసారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకి మార్గ నిర్దేశనం చేసేలా బడ్జెట్ ఉంది.. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్థం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమ శిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
మూలధన వ్యయాన్ని 40,636 కోట్ల రూపాయలకు పెంచడం ద్వారా మౌళిక వసతులు రాష్ట్రంలో పెరుగుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 3,22,359 కోట్ల రూపాయలతో ప్రణాళికబద్ధంగా రూపొందించి బడ్జెట్ ఇది అన్నారు. సూపర్ సిక్స్ పథకాల అలుకు బడ్జెట్ లో కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి మన స్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.