అఖిలపక్ష సమావేశంలో మేము కోరింది ఇవే : ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు

-

రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు హాజరయ్యారు. అఖిల పక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించాలని కోరినట్టు తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టును నిధులు, ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి ఎందుకు వచ్చాయి..? విజయవాడ వరదల నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ అంశాల గురించి చర్చించాలని కోరామన్నారు.

అలాగే సోషల్ మీడియా వేధింపులు గురించి పార్లమెంట్ లో చర్చించి వాటిని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందరి నుంచి అభిప్రాయాలను సేకరించాలని కోరామన్నారు. ముస్లిం మైనార్టీ సోదరుల అభిప్రాయాలను గౌరవిస్తూ.. వారికి ఇబ్బంది లేకుండా వక్ఫ్ చట్ట సవరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనే సూచించామని.. ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనతలపై అంతర్జాతీయంగా చర్చ జరగాల్సిన చోట, అపకీర్తి మూటగట్టుకునే అంశాలపై రాష్ట్రం పేరు బయటికి రావడం బాధకరమన్నారు. గోదావరి -పెన్నా నదుల అనుసంధానం పై కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదని, అది పూర్తి అయితే రూ.10లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అందుకే నదుల అనుసంధానం పై చర్చించాలని విజ్ఞప్తి చేశామన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news