ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగారు. 143 బంతుల్లో శతకం బాదారు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. టెస్ట్ లలో అతనికి ఇది 30వ సెంచరీ కావడం విశేషం. 487/6 స్కోర్ వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ఆసీస్ ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ 161, కే.ఎల్. రాహుల్ 77, పడిక్కల్ 25, రిషబ్ పంత్ 01, జురెల్ 01, వాషింగ్టన్ సుందర్ 29, నితీష్ రెడ్డి 38 రన్స్ చేశారు.
ఇక ఆష్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 104 పరుగులకే కుప్ప కూలింది. రెండో ఇన్నింగ్స్ లోనైనా భారీ స్కోరు చేస్తుందనుకున్న సమయంలో స్కోరు ఖాతా కూడా తెరవకుండా 1 వికెట్ కోల్పోవడం విశేషం. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 05/1. ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించాలంటే 534 పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా కు అలా చేయడం సాధ్యం కాదనే చెప్పాలి. టీమిండియా 9 వికెట్లు తీస్తే.. ఘన విజయం సాధిస్తుంది.