శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి టెన్షన్ నెలకొంది. దీంతో భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస ( మం ) చీపిలో పెద్దపులి సంచారం చేస్తోంది. ఒడిశా నుంచి ఆంధ్రా లో ప్రవేశించింది పెద్ద పులి. దీంతో భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. ఈ తరుణంలోనే.. .అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు.
పులి బారి నుంచి కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేసారు. భావనాపురం చెరువు దగ్గర పులి పాద ముద్రలు గుర్తించారు అటవీశాఖ అధికారులు. ప్రజలను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు…. రాత్రిపూట పొలాలలో కాపలాకు వెళ్లొద్దని సూచనలు చేశారు.
అటు కాకినాడ ప్రత్తిపాడు మండలం బాపన్నధార అటవీ ప్రాంతంలో పెద్ద పులి టెన్షన్ నెలకొంది. ఆవు దూడను వేటాడిన పులి,పాద ముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ట్రాఫ్ కెమెరాలకు పులి చిక్కలేదు. దీంతో ఆందోళన లో ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న అధికారులు… పులి జాడ తెలిసేంతవరకు ధారపల్లి జలపాతం కి సందర్శకులు రావొద్దని సూచనలు చేస్తున్నారు.