తిరుమలలో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ తరుణంలోనే… టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనం కు 18 గంటల సమయం పడుతోంది. అటు నిన్న తిరుమల శ్రీవారిని 59784 మంది భక్తులు దర్శించుకున్నారు. 20740 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
హుండీ ఆదాయం 3.61 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు ఇవాళ తిరుమలలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు,విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచన చేశారు. ఈ రోజు అంటే మంగళవారం రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 10 వరకు చిన్నశేష వాహన సేవ, 11 నుంచి 12 వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ ఉండనున్నట్లు తెలిపారు.
- తిరుమల….31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనం కు 18 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59784 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 20740 మంది భక్తులు
- హుండీ ఆదాయం 3.61 కోట్లు