నేడు తిరుమలలో శ్రీవారికి గరుడ సేవ

-

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు జరిగే గరుడ వాహన సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. గరుడ సేవకు పెద్దసంఖ్యలో.. భక్తులు వస్తారని భావిస్తున్న అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ప్రశాంతంగా స్వామి వారి సేవలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు. వాహన సేవ తిలకించేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గ్యాలరీలు నిండాక మాడవీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు.. ఇన్నర్ రింగ్ రోడ్డులో వేచివున్న భక్తులు మాడవీధుల్లోకి వచ్చేందుకు క్యూలైన్ ఏర్పాటు చేశారు. గ్యాలరీల్లో భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, నీళ్లు పంపిణీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గురుడ సేవ సందర్భంగా అదనంగా 1,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

వేడుకల్లో భాగంగా నాలుగోరోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి గజేంద్రమెక్షం అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు .వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version