Cyclone Michaung : తిరుమలలో 25 CM వర్షపాతం కురిసింది. ఈ తరుణంలోనే..తిరుమలలోని పాపవినాశనం డ్యాం,గోగర్బం డ్యాంలను పరిశీలించారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 15 రోజులు క్రితం తిరుమల,తిరుపతికి త్రాగునీటి ఇబ్బందులు తల్లేత్తకూండా చర్యలు తీసుకోవాలని సమావేశం ఏర్పాటు చేసామన్నారు.
మూడు రోజుల వ్యవధిలో 25 సెమి వర్షపాతం కురవడంతో తిరుమలలో అన్నీ డ్యాంలు నిండిపోయ్యిందని చెప్పారు. ఏడాదిన్నర పాటు ఎలాంటి ఇబ్బందులు లేకూండా త్రాగునీటి నిల్వలు వున్నాయన్నారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి.
ఇక అటు తూఫాన్ ప్రభావం తో విశాఖలోని మత్సకార గ్రామాలు బిక్కుబిక్కు మంటున్నాయి.. ఓవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, మరోవైపు భీకర గాలులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.. తీరానికి ఆనుకొని ఉన్న జాలరి పేట, సాగర్ నగర్, జోడుగుల్ల పాలెం, మువ్వల వాని పాలెం, ఉప్పాడ, తిమ్మాపురం లోని వేలాది మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు..