తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ !

-

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేసింది సీబీఐ దర్యాప్తు బృందం. భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పని చేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఏఆర్ డైరీ(దుండిగల్) ఎండీ రాజు రాజశేఖరన్‌లు అరెస్ట్ అయ్యారు. క్రైమ్ నెంబర్ 470/24లో అరెస్ట్ చేసి తిరుపతి కోర్టులో హాజరు పరిచారు అధికారులు.

tirumala laddu

ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు… ఏఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపారు. రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించింది. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థం లేదని విచారణలో తేల్చిన అధికారులు.. ఈ మేరకు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news