అల్లు అర్జున్ నటించిన… పుష్ప 2 సినిమా విజయం పైన మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో వేర్వేరు కాంపౌండ్లు అనేవి లేవని ఆయన వివరించారు. ఎవరు హిట్టు కొట్టిన వాళ్లను అభినందించాల్సిందేనని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా విశ్వక్సేన్ నటించిన లైలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/12/allu-arjun-1.jpg)
విశ్వక్, బాలకృష్ణ అలాగే తారక్…. చాలా మాట్లాడతారు… అతడు ఈ వెంట్రుక నేను వెళ్లడమేంటని కొందరు మాట్లాడుకుంటున్నారు… మనిషన్నాక వేరే వాళ్ళ పై అభిమానం ఉండకూడదా అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి. ఏ సినిమా సక్సెస్ అయిన అందరూ గర్వపడాలి అని వివరించారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 హిట్ కావడం తనకు ఎంతో గర్వకారణమని… చెప్పుకోచ్చారు.