తిరుమల బ్రహ్మోత్సవాల్లో సింహవాహనంపై శ్రీవారి వైభవం

-

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఇవాళ ఉదయం స్వామి వారికి సింహ వాహనసేవ నిర్వహించారు. సింహ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. సింహ వాహనంపై తిరుమలేశుడి వైభవాన్ని చూసిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇవాళ రాత్రి 7 గంటలకు శ్రీవారికి ముత్యపు పందిరి వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీవారు సింహ వాహ‌నాన్ని అధిరోహించారని ఆలయ అర్చకులు తెలిపారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమైందని చెప్పారు. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయని.. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news