తిరుమల శ్రీ వారి భక్తులకు అలర్ట్. తిరుమల రూ.300 స్పెషల్ దర్శనం అక్టోబర్ కోటా టికెట్లను ఈనెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు TTD ప్రకటించింది. ఉ.10 గంటలకు ఆన్లైన్ లో టోకెన్లు రిలీజ్ చేస్తామని పేర్కొంది. అదేరోజు మ.3గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటాను విడుదల చేస్తామని పేర్కొంది.

22న ఉ.10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, 23న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణ ఉచిత టికెట్లు రిలీజ్ కానున్నాయి. అటు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్ని నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న శ్రీవారిని 73,020 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు వచ్చినట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు. 27,609 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.