తిరుమల భక్తులకు అలర్ట్.. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్ని నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న శ్రీవారిని 73,020 మంది భక్తులు దర్శించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు వచ్చినట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు. 27,609 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. వర్షాలు అధికంగా ఉన్నప్పటికీ భక్తులు ఏమాత్రం ఆలోచించకుండా స్వామివారి దర్శనానికి పోటెత్తున్నారు. దీంతో ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.