తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..తిరుమలలో భక్తుల రద్దీ తగ్గి పోయింది. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం తొమ్మిది కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 69,365 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
26 వేల మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3.05 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. ఇక ప్రస్తుతం టోకేన్ లేని భక్తులు సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. ఇది ఇలా ఉండగా, తిరుమలలో ఈ నెల 21వ తేదీన గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ జరుగనుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.