తిరుమలలో ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర భక్తులు ఆందోళనకు దిగారు. టైం స్లాట్ దర్శనం టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు మూడు వేల టోకెన్లు జారీ చేస్తున్నారని.. అయితే దర్శనం టోకెన్ల దందా సాగుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు.
తద్వారా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు టోకెన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు.
- తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78414 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 26100 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.45 కోట్లు