మెగా బ్రదర్ నాగబాబు కొత్త గెటప్ లో మెరిసారు. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా జిమ్‌లో భారీ వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నాగబాబు పంచుకున్నారు. అంతేకాకుండా ఈ పిక్స్‌కు వ్యాయామం లేనిది.. జీవితమే లేదని క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగా బ్రదర్ పోస్ట్ నెట్టింట వైరలైంది.
నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన జనవరి మొదటి వారంలో ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా,,,మంత్రులుగా నాగబాబు, పల్లా ప్రమాణం చేయబోతున్నారట. ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సీఎం చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్‌లోకి జనసేన నేత, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకోనున్నటు ప్రకటించారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం.