CM Jagan: నేడు 8వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల అయింది. ఈ రోజు సాయంత్రం నాయుడు పేటలో జరిగే బహిరంగ సభ లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఈ సభ అనంతరం ఓజిలి, బూదనం, గూడూరు క్రాస్.. వెంకటాచలం…కాకుటూరు క్రాస్…బుజ బుజ నెల్లూరు మీదుగా చింతారెడ్డి పాలెంకు చేరుకుంటున్నారు సీఎం జగన్.
ఇక ఇవాళ రాత్రి చింతారెడ్డి పాలెం లో బస చేస్తారు సీఎం జగన్. 5న యాత్రకు విరామం ఉండనుంది. 6న సాయంత్రం కావలిలో బహిరంగ సభ ఉంటుంది. అనంతరం కందుకూరు నియోజకవర్గంలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశించనుంది.