నల్లగొండ జిల్లాలో ఘోరం.. తాగునీటి ట్యాంకులో పడి 30 కోతులు మృతి !

-

నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాగునీటి ట్యాంకులో పడి 30 కోతులు మృతి చెందాయి. బాధ్యత లేని అధికారులు.. రాజకీయం తప్ప ప్రజల ప్రాణాలు లెక్కలేని ప్రభుత్వంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది. కోతులు చనిపోయిన నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేశారని నల్గొండ అధికారులు. ఈసంఘటన నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయ విహార్ పక్కన జరిగింది.

Mass death of monkeys in dilapidated water tank

విజయ విహార్ పక్కన వాటర్ ట్యాంక్‌లో కోతుల కళేబరాలు వెలుగులోకి వచ్చాయి. అవే నీటిని గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్నారు NSP అధికారులు. దీంతో కోతుల కళేబరాలు ఉన్న నీటిని తాగుతున్నారు నల్గొండ ప్రజలు. వాటర్ ట్యాంకు పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్ళిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందినట్లు సమాచారం. 30 నుంచి 40 వరకు కోతుల మృతదేహాలు నీటిలో తేలుతున్నాయి. ఇప్పుడు ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version