బుడమేరు గండి పడిన ప్రాంతంలో కుండపోత వర్షం

-

విజయవాడలోని బుడమేరులో గండి పడిన ప్రాంతంలో ప్రస్తుతం కుండ పోతగా వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్నప్పటికీ గండి పూడ్చివేత పనులు దగ్గరుండి చేయిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గండి పూడుస్తూనే మరోవైపు నీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు. మచిలీపట్నం నుంచి వచ్చిన మర బోట్లను బుడమేరు గండి పడిన ప్రాంతానికి తరలించారు అధికారులు.

సరుకు బాదులు నిలబెట్టి నీటిని తాత్కాలికంగా రేకుల ద్వారా వరద నీటికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు అధికారులు. మరోవైపు గండి పడిన ప్రాంతానికి పెద్ద స్థాయిలో చేరుకుంటుంది ఆర్మీ. సిక్స్త్ మద్రాస్ మిలిటరీ బెటాలియన్ నుంచి 120 మంది అధికారులు, జవాన్లు చేరుకుంటున్నారు.

మరికొద్ది సేపట్లో మిలిటరీ ఆధ్వర్యంలో మరమ్మత్తులు చేపట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా రాడ్డులతో వంతెనల్లాగా నిర్మాణం చేసి దాంట్లో రాళ్లు వేసి పూడుస్తాం అంటున్నారు మిలటరీ అధికారులు. మరికొద్ది సేపట్లో బుడమేరు గండి పడిన ప్రాంతానికి చేరుకోనుంది మిలటరీ అధికారుల సామాగ్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version