వార్డెన్లు విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క హెచ్చరిక

-

వార్డెన్లు విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క హెచ్చరిక జారీ చేసింది. తాజాగా పలు హాస్టళ్లను పరిశీలించిన ఆమె మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో టీచర్లు, వార్డెన్లు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. విద్యార్థులు హాస్టల్ విడిచి వాగుల వద్దకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలి. విద్యార్థులు జ్వరం బారిన పడితే ఇంటికి పంపకుండా మనమే మెరు గైన వైద్యం అందించాలి. హాస్టల్ విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకోవాలి. అప్పుడే మీ పిల్లలను దేవుడు మంచిగా చూస్తాడు.

హాస్టల్స్ అంటే సొంత ఇంటిలా విద్యార్థులు ఫీల్ అవ్వాలి. నాణ్యమైన వేడి బోజనాన్ని అందించాలి. వేడి చేసి చల్లార్చిన తాగు నీటిని ఇవ్వాలి. తప్పకుండా మెనూ ఫాలో కావాలని సూచించారు. హాస్టళ్లలో సరుకుల  సరఫరా సరిగ్గా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొందరూ  చిన్న చిన్న సమస్యలను బూతద్దం లో పెట్టి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బ తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version