విజయవాడ డివిజన్‌లో భారీగా రైళ్ల రద్దు.. వివరాలు ఇవే

-

విజయవాడ డివిజన్‌లో భారీగా రైళ్లు రద్దయ్యాయి. నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు-విశాఖపట్నం రైలు ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు, విజయవాడ-బిట్రగుంట (07977/07978) రైలు ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు, మచిలీపట్నం-విశాఖపట్నం (17219/17220 ) రైలు 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు, గుంటూరు-రాయగడ (17243/17244) రైలు 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు విజయవాడ రామవరప్పాడు మధ్య ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు.. 07896 మచిలీపట్నం-విజయవాడ, 07769 విజయవాడ-మచిలీపట్నం, 07863 విజయవాడ- నర్సాపూర్‌, 07866 విజయవాడ- మచిలీపట్నం, 07770 మచిలీపట్నం- విజయవాడ, 07283 విజయవాడ- భీమవరం జంక్షన్‌, 07870 మచిలీపట్నం- విజయవాడ, 07861 విజయవాడ-నర్సాపూర్‌ రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వివరించారు. యర్నాకుళం-పాట్నా, భావనగర్‌-కాకినాడపోర్ట్‌, బెంగళూరు-గౌహతి, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌-భువనశ్వర్‌, ధన్‌బాద్‌-అల్లపూజ, టాటా- యశ్వంత్‌పూర్‌, హతియా-బెంగళూరు, హతియా-బెంగళూరు, టాటా-బెంగళూరు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news