ఏపీలో బదిలీలకు గైడ్ లైన్స్ జారీ చేసిన శాఖలు..!

-

ఏపీలో బదిలీలకి గైడ్ లైన్స్ జారీ చేస్తున్నాయి వివిధ శాఖలు. రవాణ శాఖలో రెండేళ్లకే స్థాన చలనం ఉండేలా గైడ్ లైన్స్ జారీ చేసారు. రవాణా శాఖ లోని ఉద్యోగ సంఘాలు ఏవీ కోరకుండానే బదిలీల్లో గైడ్ లైన్స్ తీసుకు వచ్చారు. కొందరు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ల లాబీయింగులతోనే బదిలీ నిబంధనల సడలింపులు చేసారని అని విమర్శలు వస్తున్నాయి. కానీ జనరల్ గైడ్ లైన్స్ ప్రకారమే శాఖాపరంగా బదిలీల గైడ్ లైన్స్ రూపొందించామని రవాణ శాఖ పేర్కొంది.

అయితే రెండేళ్ల కిందటే రవాణా శాఖలో పెద్దఎత్తున బదిలీలు జరిగాయంటోన్నారు అధికారులు. ఇక త్వరలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకూ గైడ్ లైన్స్ జారీ చేయనున్నారు అధికారులు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో కూడా రెండేళ్లకే పెట్టాలా..? లేక జనరల్ గైడ్ లైన్స్ వర్తింప చేయాలా..? అనే అంశంపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. త్వరలోనే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ అధికారులు బదిలీల ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version