టెస్లా వైస్ ప్రెసిడెంట్ ‘శ్రీలా వెంకటరత్నం’ రాజీనామా..!

-

కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారతీయ సంతతికీ చెందిన శ్రీలా వెంకటరత్నం రాజీనామా చేసారు. సుమారు 11 సంవత్సరాలు టెస్లా కంపెనీలో అనేక కీలక బాధ్యతలు చేపట్టిన ఈమె ఉద్యోగానికి రాజీనామా చేసారు. టెస్లా ఫైనాన్స్ ఆపరేషన్ డైరెక్టర్ గా తన ఉద్యోగం ప్రారంభించి.. వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు శ్రీలా వెంకటరత్నం. తన కుటుంబం, స్నేహితులతో కాలం గడపడానికి ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఇక ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం తన లింక్డ్ ఇన్ పోస్టులో వెల్లడించారు. టెస్లాలో ఆమె ప్రారంభం రోజుల నుంచి ప్రాజెక్ట్ లను మ్యాపింగ్ చేస్తూ.. కంపెనీ ఉన్నతికి తోడ్పడింది. మేము కలిసి ఇంత సాధించినందుకు గర్విస్తున్నాను అంటూ వెల్లడించింది. తాను కంపెనీలో చేరిన తరువాత సంస్థ 700 బిలియన్ డాలర్ల కంపెనీ గా అవతరించిందని.. ఇది తమకు చాలా సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. శ్రీలా వెంకటరత్నం చేసిన పోస్ట్ కు టెస్లా మాజీ సీఎఫ్ఓ జేసన్ వీలర్ స్పందిస్తూ.. మంచి నిర్ణయం తీసుకున్నావు శ్రీలా.. కంపెనీలో అద్భుతమైన విజయాలు సాధించినందుకు అభినందనలు అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version