Tirumala Ghat Road : తిరుమలలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమల ఘాట్ రోడ్లపై జారిపడ్డాయి బండ రాళ్లు. అయితే… ఈ రహాదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు. జేసీబీ సహాయంతో బండ రాళ్లను తొలగిస్తున్నారు. అంతేకాదు… తిరుమలలో భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ..కీలక నిర్ణయం తీసుకుంది.
రెండవ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా మొబైల్ స్క్వాడ్ టీంలని నియమించింది టీటీడీ. ఇంజనీరింగ్,ఫారెస్ట్, విజిలేన్స్ సిబ్బందితో టీంలని ఏర్పాటు చేసింది టీటీడీ. దీంతో ఘాట్ రోడ్డును నిరంతరాయంగా తనిఖీ చేయనున్నాయి మొబైల్ స్క్వాడ్ టీంలు. రెండవ ఘాట్ రోడ్డులో అక్కడక్కడ విరిగిపడుతున్నాయి మట్టి పెళ్ళలు. అటు జేసీబీల సహాయంతో మట్టి పెళ్ళను తొలగిస్తోంది సిబ్బంది..