ట్రోల్స్​పై స్పందించిన టీటీడీ ఛైర్మన్ భూమన

-

తిరుమలలో ఈ మధ్య చిరుతలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది.

చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బోనులో చిక్కిన మగ చిరుతకు దాదాపు ఐదేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మరోవైపు, అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను వారు ఖండించారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని ఛైర్మన్ భూమన తెలిపారు.

ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నామంటున్నారని.. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version