శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి

-

తిరుపతి: శ్రీ పద్మావతి చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు పరిశీలించిన టిటిడి ఈవో ధర్మా రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది నవంబర్ నాటికి హాస్పిటల్ ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. భారత దేశంలోనే అత్యాధునిక చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా 320 కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు. చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నియోనాటల్, న్యురాలజి, పల్మనాలజీ, నెఫ్రాలజీ విభాగంలో అత్యాధునిక చికిత్స అందిస్తామన్నారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే బెస్ట్ హాస్పిటల్ గా దీన్ని నిర్మిస్తున్నామన్నారు. శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఇప్పటికీ 1450 హార్ట్ సర్జరీలు విజయవంతంగా చేయడం జరిగిందని.. 72 గంటల వయస్సు ఉన్న చిన్నారికి కూడా హార్ట్ ఆపరేషన్ చేశామన్నారు. జీవన్ దాన్ లో నాలుగు హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. నవంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version