10 వేల చేతి కర్రలకు ఆర్డర్ ఇచ్చామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నిబంధనలు కొనసాగిస్తామని… టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ. 45 వేలతో 10వేల చేతి కర్రలకు ఆర్డర్ ఇచ్చినట్టు వెల్లడించారు.
అలిపిరిలో భక్తులకు కర్రలు ఇచ్చి నరసింహస్వామి ఆలయం వద్ద తీసుకుంటామని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఆగస్ట్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 120.05 కోట్లు వచ్చింది TTD ప్రకటన చేసింది. తిరుమల అష్ట వినాయక అతిధి గృహాన్ని సామాన్య భక్తులుకు కేటాయించేలా వాటి ధరను 150 రూపాయలకు తగ్గిస్తూన్నామని టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి ప్రకటించారు. వికాస్ నిలయంలో అతిధి గృహాని 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికరణ చేస్తూన్నామని చెప్పారు టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి.