ఎడిట్ నోట్: జమిలితో జాగ్రత్త.!

-

జమిలి ఎన్నికల్లో గత కొన్నేళ్ళ నుంచి దేశ రాజకీయాల్లో ఎక్కువ చర్చ జరుగుతున్న అంశం. ఒకే దేశం..ఒకే ఎన్నిక నినాదంతో మోదీ సర్కార్ అడుగులేస్తుంది. దీన్ని కార్యాచరణలోకి తీసుకురావాలని తీవ్రంగానే ప్రయత్నిస్తుంది..కానీ అది ఇప్పటివరకు సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఒకే దేశ..ఒకేసారి ఎన్నికల బిల్లుని తీసుకొచ్చి ఆమోదించుకుని..పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎక్కువ శాతం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందడం సులువు కాదు..బి‌జే‌పి మిత్రపక్షాలే వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే..జమిలి ఎన్నికల నిర్వహణ కూడా అంత సాధ్యపడే అంశం కాదు. ఒకవేళ జరిగితే సంచలనమే అవుతుంది..అదే సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మార్పు ఎక్కువ ఉంటుంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్థానికంగా అంశాల బట్టి ఓట్లు వేస్తారు. లోక్ సభ ఎన్నికలకు దేశ పరిస్తితులని బట్టి ముందుకెళ్తారు. రెండు ఒకేసారి జరిగితే జాతీయ స్థాయిలోనే అంశాలు ఎక్కువ ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.

ఇప్పుడు ఈ అంశమే తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీని టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలలు జరుగుతాయి. ఇప్పుడు జమిలి ఎన్నికలని చెప్పి..లోక్ సభ ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలు నిర్వహిస్తే పరిస్తితులు మారిపోతాయి.

ఎందుకంటే 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్ళి..అసెంబ్లీ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ లబ్ది పొందింది. అప్పుడు 48 శాతం వరకు ఓట్లు సాధించింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 41 శాతం మాత్రమే వచ్చాయి. బి‌జే‌పికి 20 శాతంపైనే ఓట్లు పడ్డాయి. అంటే రెండు ఎన్నికలకు ఎంత తేడా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే బి‌ఆర్‌ఎస్‌కు నష్టం జరిగే ఛాన్స్. కానీ జమిలి ఎన్నికలు జరగడం అనేది కాస్త కష్టమైన పనే.

Read more RELATED
Recommended to you

Latest news