పెళ్లి చేసుకునే వారికి TTD పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 1 నుంచి కళ్యాణమస్తు కార్యక్రమానికి రిజిష్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని ప్రకటించింది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి. కళ్యాణమస్తూ లగ్న పత్రికకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఆగష్ట్ 7వ తేదిన ఉదయం 8:07 నిముషాల నుంచి 8:15 మధ్య వివాహ మూహుర్తం నిర్ణయించామని వెల్లడించారు టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి. . ఏపిలోని 26 జిల్లా కేంద్రాలలో కళ్యాణమస్తూ కార్యక్రమాని నిర్వహిస్తామని చెప్పారు. జూలై 1వ తేదిన రిజిష్ట్రేషన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి. వివాహ జంటకు తాళిబోట్టు,మెట్టులు,వస్ర్తాలు టిటిడి తరపున అందిస్తామని స్పష్టం చేశారు. ఏపిలో విజయవంతంగా నిర్వహించిన అనంతరం ఇతర రాష్ట్రాలలో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి.