తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి రూ.300 కోటా టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ ఏటా 300 రూపాయల టికెట్లు విడుదల కానున్నాయి. ఇక ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి.
ఇక తిరుమలలో రేపు రామకృష్ణ తీర్ద ముక్కోటి జరుగనుంది. ఈ తరుణంలోనే.. రేపు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనుంది టీటీడి. అలాగే… రేపు పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ ఉంటుంది. దీంతో రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.
ఇక తిరుమల టికెట్ల కోసం..
https://www.tirumala.org/ ఈ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలి.