బ్రేకింగ్: కాగ్ ద్వారా ఆడిట్, టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం

-

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జరుగుతున్న ఆడిట్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక పై టీటీడీలో ఆడిట్ ను కాగ్ ద్వారా చెయ్యాలని ప్రభుత్వానికి సిపారస్సు చేసింది పాలక మండలి. 2014-19 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దీని పై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఇప్పటికే హైకోర్టును సుబ్రమణ్య స్వామి, సత్యపాల్ సభర్వాల్ ఆశ్రయించారు.

ttd

2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంటు ఆడిట్ నిర్వహించినప్పటికీ దీని పై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని పాలక మండలి కోరింది. ప్రతి ఏట స్టేట్ ఆడిట్ ద్వారా సక్రమంగా ఆడిట్ జరుగుతున్నప్పటికీ అనవసర ఆరోపణలు నేపథ్యంలో భక్తులలో విశ్వాసం కల్పించేందుకు కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version