చంద్రబాబు కేసులోకి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు కేసు సీబీఐకి అప్పగించాలి అని పిల్ వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్… కుట్ర కోణంతో చంద్రబాబు నాయుడు సంబంధం ఉన్నట్లు వ్యాఖ్యనించారు. అంతేకాదు…రూ. 241 కోట్ల దారి మళ్లింపు, పూర్తి నిందితుల జాబితాతో సవివరంగా వివరాలు పొందు పరచిన ఉండవల్లి… సీమెన్స్ ఇండియా గుజరాత్ MOUలో పెట్టిన పేరు సంతకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిన పేరు సంతకం వేరు వేరుగా ఉన్నాయని వెల్లడించారు.
దురుద్దేశ పూర్వకంగా, కుట్ర కోణంతో చంద్రబాబు నాయుడు సహకారంతో 241 కోట్ల దారి మళ్లింపు జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు ఉండవల్లి. మొత్తం నిందితుల బైలు ఆర్డర్లలో జస్టిస్ సురేష్ కుమార్ రెడ్డి నిధుల దుర్వినియోగ విషయంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పూర్తిగా సహకరించాలి అని పేర్కొంటూ, నిందితుల సహకారం లేని పక్షంలో నిందితులకు బెయిల్ రద్దుకు సీబీఐకి అనుమతి ఇచ్చారని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక్క MOU తప్ప కేసుకి సంబందించిన అన్నీ డాక్యుమెంట్స్ జత చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్…రిమాండ్ ఆర్డర్స్, రిమాండ్ రిపోర్ట్స్ సహ అన్నీ వివరాలు పొందుపరచి 44 మంది ప్రతి వాదులను చేర్చారు.