ఉండవల్లి తన వ్యక్తిత్వాన్ని తానే చంపుకున్నారు : పట్టాబి

ఉండవల్లి తన వ్యక్తిత్వాన్ని తానే చంపుకున్నారని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలు విశ్వసించడంలేదు అన్నారు.
ముఖ్యంగా ఉండవల్లి ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై పిటిషన్ వేయడంపై మండిపడుతున్నారు..ఇసుక, మద్యం అక్రమాలపై సిబిఐ ఎందుకు కోరలేదు అని ప్రశ్నించారు.

ఉండవల్లి పిటీషన్ ను చూసి మీరు చదివే వేశారా.. ఏవరో ఇస్తే వేశారా ? చంద్రబాబు గురించి మీకు ఏమి తెలుసు..ఉండవల్లి పిటిషన్ చూసి జనం నవ్వుతున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసు వివరాలు ఉండవల్లి తెలుసుకోవాలి. ప్రచార ఆర్భాటాలకు పోవద్దు
తప్పుడు ప్రచారాలను మానుకోండి. సీఎం జగన్ ఎన్ని కుట్రలు పన్నిన న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. ఛంద్రబాబు జైలు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారు. జైలు సిబ్బంది చంద్రబాబును దేవుళ్ల చూసుకుంటున్నారు.ప్రభుత్వ డొల్లతనం అంతా న్యాయస్థానంలో వెల్లడైంది. చేసిన తప్పు తెలిసి సి.ఎం. జగన్ కు జ్వరం పట్టుకుంది.రేపటి నుండి జగన్ కు కౌన్ డౌన్ మొదలైంది. లోకేష్ ఢిల్లీ పారిపోవాల్సిన అవసరంలేదు. కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్న జగన్ కోర్టు ముందు హాజరై నిర్ధోషితత్వం నిరూపించుకోవాలి అన్నారు.