అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని వెళ్లారని అంటున్నారు. ఇటీవల పామర్రులో రప్పా రప్పా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. ఇక పేర్ని నాని వ్యాఖ్యలపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు పేర్ని నాని. ఈ నెల 22న పిటిషన్ పై విచారిస్తామని పేర్కొంది ఏపీ హైకోర్టు.
దింతో అజ్ఞాతంలోకి వెళ్లారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇక అటు పేర్ని నాని కోసం గాలిస్తున్నాయి ప్రత్యేక పోలీస్ బృందాలు. కాగా రప్పా రప్పా కాదు.. చీకట్లో కన్నుకొడితే TDP అయిపోవాలి అని హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ కు దీటుగా రప్పా రప్పా అంటే వాళ్లకు మనకు తేడా ఏంటి? అన్నారు.