మరో వివాదంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా… చిక్కుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు.. కాంగ్రెస్ నాయకులతో కలిసి జర్నలిస్టులను వేధిస్తున్నారట సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఉపాధ్యాయుల సర్ధుబాట్ల అన్యాయంగా చేశారని, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు రాజిరెడ్డిపై కలెక్టర్ అక్రమ కేసు పెట్టి జైళ్లో నిర్బందిస్తే.. తప్పు అని ఖండిస్తూ వార్తాలు రాశానని, టీ స్టాల్ మీద కేటీఆర్ బొమ్మ ఉందని టీ కొట్టు నిర్వహకునిపై కేసు నమోదు చేశారనే వార్తా రాసినందుకు బలగం టీవీ న్యూస్ జర్నలిస్ట్ కాయేతి బాలరాజును వేధింపులకు గురిచేస్తున్నారట.

ఇక తాజాగా జర్నలిస్ట్ కాయేతి బాలరాజు ఇంట్లో లేని సమయంలో.. ఇంట్లోకి అనుమతి లేకుండా చొరబడి ఎలాంటి నోటీసులు లేకుండా మెజర్మెంట్లు తీసుకున్నారు మునిసిపల్ అధికారులు. ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారట. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి చెప్తేనే కలెక్టర్ ఇదంతా చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు జర్నలిస్ట్ బాలరాజు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు.. కాంగ్రెస్ నాయకులతో కలిసి జర్నలిస్టులను వేధిస్తున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఉపాధ్యాయుల సర్ధుబాట్ల అన్యాయంగా చేశారని, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు రాజిరెడ్డిపై కలెక్టర్ అక్రమ కేసు పెట్టి జైళ్లో నిర్బందిస్తే.. తప్పు అని ఖండిస్తూ… pic.twitter.com/ARokMcCA6Y
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2025