వైఎస్ వివేకా కేసులో టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వివేకా హత్య కేసులో వెనుక ఎవరు ఉన్నారు అనే వాస్తవాలను న్యాయస్ధానాలు నిగ్గు తేలుస్తాయని చెప్పారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా న్యాయ స్ధానాలపై మాకు నమ్మకం ఉందని వివరించారు. గూగుల్ టేకవుట్ మొదటి నుంచి ఎందుకు లేదు.. ఈ మధ్యలో సిబిఐ ఎందుకు బయటకు తీసుకువచ్చారని ఆగ్రహించారు.
న్యాయస్ధానాలను పక్కదారి పట్టించేలా గతంలో సిబిఐ వ్యవహరించిందని గతంలో ఆధారాలతో సహ కోర్టుకు సమర్పించామన్నారు. వివేకానంద హత్య విషయం మాట్లాడుతూ.. ఆధారాలు లేక గూగుల్ టేక్ అవుట్ అని సిబిఐ చార్జ్ షీట్ దాఖలుచేసిందని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు వ్యక్తి గతంగా బురదచల్లే ప్రయత్నం జరుగుతోందని ఫైర్ అయ్యారు.. చంద్రబాబు, పవన్ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ప్రతి పక్షాలు ఎలా వచ్చినా మేము సిద్దమేనంటూ ప్రకటించారు.