ఆడపిల్ల పుడితే రూ. 50 వేలు అకౌంట్‌లో.. ఈ స్కీమ్‌ గురించి తెలుసా..?

-

కొంతమందికి పెంచే స్తోమత ఉన్నా కూడా.. ఆడపిల్ల వద్దు అనుకుంటారు. అదేంటో మగపిల్లలు పుట్టినప్పుడు ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. అదే ఆడపిల్ల పుడితే అంత ఆనందంగా ఉండరు. దేశంలో ఇప్పటికీ ఆడపిల్లలను వద్దు అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే స్త్రీ వృద్ధి రేటు తక్కువగా ఉంది. పది మంది మగపిల్లలకు ఆడపిల్లలకు ఆరుగురే ఉంటున్నారు. అందుకే ఆడపిల్లలను పెంచాలని ప్రభుత్వాలు గట్టి నిర్ణయం తీసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆడపిల్లల ఉన్నత విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాలికల ఉన్నతిని కాంక్షిస్తూ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది.

రాష్ట్రంలోని ఆడపిల్లలను ఆదుకునేందుకు 2016 ఏప్రిల్ 1న మాఝీ కన్యా భాగ్యశ్రీ యోజన స్కీమ్‌ (Majhi Kanya Bhagyashree Yojana)ని లాంచ్‌ చేసింది. రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్యను పెంచడం, వారి సంక్షేమం ఈ స్కీమ్‌ ప్రధాన లక్ష్యం. ఆడపిల్లల చదువు బాధ్యతను కూడా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మాఝీ కన్యా భాగ్యశ్రీ యోజన కింద మహారాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒకరు లేదా ఇద్దరు కుమార్తెలు ఉన్న కుటుంబాలు ఈ స్కీమ్‌ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ పథకం కింద మూడో ఆడపిల్లకు ఎలాంటి ప్రయోజనాలు లభించవు.

ఈ పథకానికి అర్హత పొందాలంటే, లబ్ధిదారులకు మహారాష్ట్రలో పర్మినెంట్‌ రెసిడెన్షియల్‌ అడ్రస్‌ ఉండాలి.
తల్లీ, కుమార్తెల పేరిట జాయింట్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి, వారికి రూ.లక్ష యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌తో పాటు, రూ.5 వేల ఓవర్‌డ్రాఫ్ట్‌ను అందజేస్తారు. ఆడపిల్ల పుట్టిన ఏడాదిలోపే తల్లిదండ్రులకు రూ.50 వేలు అందుతాయి.
ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు, ఇద్దరు ఆడపిల్లల పేరిట ఒక్కొక్కరికి రూ.25 వేలు మంజూరు చేస్తారు.

అవసరమైన డాక్యుమెంట్లు :

ఈ స్కీమ్‌లో రిజిస్టర్‌ చేసుకోవడానికి లబ్ధిదారులకు వ్యాలీడ్‌ మొబైల్‌ నంబర్‌ అవసరం.
ఆధార్ కార్డ్, తల్లి లేదా బాలిక బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్‌లు ఉండాలి.
అడ్రస్‌ ప్రూఫ్‌, ఇన్‌కమ్‌ ప్రూఫ్‌గా పనిచేసే ప్రభుత్వ గుర్తింపు డాక్యుమెంట్‌లు కూడా జత చేయాల్సి ఉంటుంది.

మాఝీ కన్యా భాగ్యశ్రీ యోజన ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు. ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవడానికి లబ్ధిదారులు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ (https://maharashtra.gov.in/1125/Home) ఓపెన్‌ చేసి అప్లికేషన్‌ ఫారం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ ఫారంను నింపి, అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి ఉమెన్‌ అండ్‌ ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌లో సబ్మిట్‌ చేయాలి. ప్రభుత్వం ఈ వివరాలను వెరిఫై చేసి, అప్రూవ్‌ చేసిన తర్వాత, లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్‌లో ఆర్థిక సాయం క్రెడిట్‌ అవుతుంది. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రం నుంచి కూడా అప్లికేషన్‌ ఫామ్‌ పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news